Chiranjeevi: సంచలనం రేకెత్తిస్తున్న చిరంజీవి ట్వీట్‌.. దీని ఆంతర్యం ఏంటి?

20 Sep, 2022 13:53 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన చిత్రంలోని ఓ డైలాగ్‌ను షేర్‌ చేయడం ఇటు ఇండస్ట్రీతో పాటు రాజకీయవర్గాల్లోనూ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆయన లేటెస్ట్‌ మూవీ గాడ్‌ ఫాదర్‌ చిత్రంలోని ఓ పవర్ఫుల్‌ డైలాగ్‌ను చిరు తాజాగా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్‌ రాజకీయపరంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

చదవండి: ‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌ ’డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళవారం చిరు ట్వీట్‌ చేస్తూ.. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ తన వాయిస్‌ ఓవర్‌తో ఉన్న ఆడియోను షేర్‌ చేశారు. దీంతో చిరు రాజకీయ రీఎంట్రీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ డైలాగ్‌ షేర్‌ చేయడం వెనక ఆంతర్యం ఏంటా? అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. 

మరిన్ని వార్తలు