బ్రదర్స్‌ డే : అరుదైన ఫోటోను షేర్‌ చేసిన చిరంజీవి

24 May, 2021 17:12 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలసిందే. సోమవారం బ్రదర్స్‌ డే సందర్భంగా చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌తో దిగిన ఓ అరుదైన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘తోడబుట్టిన బ్ర‌ద‌ర్స్‌కి, రక్తం పంచిన బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌కి హ్యాపీ బ్ర‌ద‌ర్స్ డే’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ ఫోటోలో పవన్‌ కల్యాణ్‌ను చిరంజీవి ఎత్తుకోగా, పక్కనే నాగబాబు ఉన్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. చిరు పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే ఈ ఫోటోకు వేలల్లో లైకులు కురిపిస్తూ ఫ్యాన్స్‌ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

చదవండి : మెగాస్టార్‌ చిరంజీవికి చెల్లిగా అనుష్క నటించనుందా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు