'మీరు నిజమైన జీవితాన్ని గడుపుతున్నారు'..చిరు ట్వీట్‌ వైరల్‌

30 Jul, 2021 20:02 IST|Sakshi

Chiranjeevi Wishes To Sonu Sood : చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సోనూసూద్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక శుక్రవారం(జులై30)న సోనూసూద్‌ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. 'ప్రియమైన సోనూసూద్‌..మీరు నిజమైన జీవితాన్ని గడుపుతున్నారు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు.

మీరు ఇలాగే ఎప్పుడూ తోటివారికి సహాయం చేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే సోనూసూద్‌' అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఇక కరోనా కాలంలో ఎంతో మందికి సహాయం చేసి సోనూసూద్‌ రియల్‌ హీరోగా మారిన సంగతి తెలిసిందే. కాగా ఆచార్య చిత్రంలో సోనూసూద్‌ లుక్‌ని చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఇందులో నుదుట బొట్టు పెట్టుకుని పిల‌క‌తో సోనూసూద్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు