చిరంజీవి స్పెషల్‌ గిప్ట్‌.. ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ బాబీ ట్వీట్‌

1 Aug, 2021 19:38 IST|Sakshi

పవర్‌ సినిమాతో దర్శకుడిగా పరిచియమైన కె ఎస్‌ రవీంద్ర అలియాస్‌ బాబీ తన ఫస్ట్ సినిమాతోనే పవర్‌ఫుల్‌ సక్సెస్‌ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా స్టార్ హీరోలతోనే సాలిడ్‌ సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌ జర్నీ చేస్తున్నాడు.. తాజాగా తన అభిమాన హీరో మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్‌ చేసే ఛాన్స్ పట్టేశాడు...ఈరోజు(ఆగస్ట్‌ 1) బాబీ బర్త్ డే. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు బాబీ.

ఇక పుట్టిన రోజు సందర్భంగా తన దగ్గరకు వచ్చిన బాబీకి ఓ ప్రత్యేకమైన కలాన్ని బహుమతిగా ఇచ్చాడు చిరంజీవి.  అయితే ఇలా ఓ అభిమాని స్థాయి నుంచి దర్శకుడిగా చిరంజీవి చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోవడంతో బాబీ భావోద్వేగానికి గురైయ్యాడు. ఈ బహుమతి ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ చిరు గిఫ్ట్‌ వీడియోని ట్వీటర్‌లో పోస్ట్‌ చేశాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు