ఆగేది లేదు!

8 Sep, 2020 02:06 IST|Sakshi

సినిమా షూటింగ్‌లను మళ్లీ ఎలా ప్రారంభించాలి? ప్రారంభిస్తే ఎలా పూర్తి చేయాలి? ఎంత త్వరగా పూర్తి చేయాలి? అనే ప్లానింగ్‌లో అన్ని సినిమా బృందాల వాళ్లు ఉన్నారు. అయితే ‘ఆచార్య’ చిత్రబృందం ఓ ప్లాన్‌ సిద్ధం చేసినట్టు సమాచారం. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాతలు. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక.

ఈ సినిమాకు సంబంధించిన మిగతా చిత్రీకరణ మొత్తాన్ని ఏకధాటిగా సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ‘ఆచార్య’ చిత్రబృందం భావిస్తున్నారట. ఆల్రెడీ సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని మొదలుపెడితే పూర్తి చేసేదాకా ఆగేది లేదన్నది యూనిట్‌ ఆలోచన అని సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు