టాలీవుడ్‌కు వరాల జల్లు; కేసీఆర్‌కు చిరు కృతజ్ఞతలు

23 Nov, 2020 19:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా కారణంగా నష్టపోయిన టాలీవుడ్‌ ఇండస్ట్రీపై వరాల జల్లు కురపించిన సీఎం కేసీఆర్‌కు మెగాస్టార్‌ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పినందుకుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. ‘కరోనాతో కుదైలైన సినిమా రంగానికి వరాల జల్లుకురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ చార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో షోలను పెంచుకునేందుకు అనుమతి, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టికెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయయి. కేసీఆర్‌ నేతృత్వంలోని ఆయన విజన్‌కు తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది.’ అని ట్వీట్‌ చేశారు. చదవండి: తెలంగాణలో తెరుచుకోనున్న థియేటర్లు 

అదే విధంగా చిరంజీవితోపాటు నాగార్జున కూడా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘కోవిడ్ వంటి అనిశ్చిత సమయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైన సహాయక చర్యలు అందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు అని ట్వీట్‌ చేశారు. వీరితోపాటు సాయి ధరమ్‌ తేజ్‌, వెంకటేష్‌, సుధీర్‌బాబు కూడా కృతజ్ఞతలు తెలిపారు. కాగా  జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు తెలుగు ఇండస్ట్రీపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురపించిన విషయం తెలిసిందే.. కరోనాతో ఇన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో కుదేలవుతున్న టాలీవుడ్‌కు కేసీఆర్ అండగా నిలుస్తానన్నాడు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. రోవైపు కరోనా కారణంగా గత పది నెలలుగా రాష్ట్రంలో మూతపడిన సినిమా థియేటర్ల పునః ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: సినీ పరిశ్రమను కాపాడుకుంటాం: కేసీఆర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా