రామజోగయ్య శాస్త్రికి షాకిచ్చిన మెగాస్టార్‌!

3 Apr, 2021 19:39 IST|Sakshi

గతేడాది ఉగాదికి ట్విటర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఖాతాలో చేరిన మెగాస్టార్‌ చిరంజీవి అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. అంతేగాక ఆయన సటైరికల్‌ పోస్టులకు ట్విటర్‌లో ఎంతో క్రేజ్‌ ఉంది. అలా ఎంతో మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటున్న చిరు.. ట్విటర్‌ ఖాతా 1 మిలియన్‌ ఫాలోవర్స్‌కు చేరువలో ఉంది. అయితే చిరు మాత్రం ట్విటర్‌లో ఎవరిని ఫాలో కారు.

కొద్ది రోజుల కిందట ఆయన ట్విటర్‌ ఫాలోయింగ్‌ లిస్టులో మాత్రం ఒకటి కనిపించేది. అదేవరిని చూడగా ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ పేరు కనిపించింది. దీంతో చిరు ట్విటర్‌లో కేవలం చెర్రినే ఫాలో అవుతున్నాడనే వార్త గుప్పుమనడంతో కొద్ది రోజులకు అన్‌ఫాలో అయ్యాడు. తర్వాత ఆయన ఫాలోయింగ్‌ ఖాతా జీరో అయ్యింది. ఇక తాజాగా చిరు ట్విటర్‌ ఫాలోయింగ్‌ లిస్టులో ఒకటి కనిపించింది. ఈ సారి రామజోగయ్య శాస్త్రి పేరు కనిపించింది.

దీంతో చిరు ట్విటర్‌లో ఫాలో అయ్యే ఒకే ఒక్క వ్యక్తిగా రామజోగయ్య శాస్త్రి నిలిచారంటు నిన్న వార్త తెగ వైరల్‌గా అయ్యింది. అది చూసిన రామాజోగయ్య శాస్త్రి సైతం హ్యాపీగా ఫీల్‌ అవుతూ.. ఎప్పటికి రుణపడి ఉంటానని, కొండంత సంతోషంగా ఉందంటూ స్పందించారు. ఇక ఎమైందో ఏమో తెలీదు ఈ రోజు చిరు ట్విటర్‌ ఫాలోయింగ్‌ జీరో అయ్యింది. కేవలం చిరు ఆయనను మాత్రమే ఫాలో అవుతున్నారని తెగ మురిసిపోయిన రామజోగయ్యకు ఒక్కసారిగా షాక్‌ తగిలింది. అయితే ఇది చిరు చేస్తున్నారా లేదా ఆయన టీం చేస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా చిరు ఇలా చేయడంపై మెగా అభిమానులంతా ఆయనకు ఏమైంది ఇలా చేస్తున్నారంటూ జుట్టు పిక్కుంటున్నారు.

చదవండి: 
ట్విట్టర్‌లో మెగాస్టార్‌ ఫాలో అయ్యే ఒకే ఒక వ్యక్తి ఆయనే..
మంగ్లీ పాటను లాంచ్ చేసిన మెగాస్టార్‌

మరిన్ని వార్తలు