Chiranjeevi Upcoming Movies: చిరు స్పీడ్‌ మాములుగా లేదుగా.. 2022లో బిగ్గెస్ట్ మెగా ఫెస్టివల్!

23 Nov, 2021 16:08 IST|Sakshi

ఒకప్పుడు మూడు షిఫ్టులు పని చేసి ఏడాదికి ఎన్ని సినిమాలు విడుదలైతే అన్ని సినిమాలు విడుదల చేసిన ఘన చరిత్ర మెగాస్టార్‌ చిరంజీవి సొంతం. ఇప్పుడు ఈ సీన్ ను మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నారు మెగాస్టార్. 2022లో వీలైతే నాలుగు చిత్రాలు విడుదల చేయాలనుకుంటున్నారట. ఫిబ్రవరిలో కొరటాల దర్శకత్వం వహిం‍చిన ‘ఆచార్య’ రిలీజ్ కానుంది. అలాగే సమ్మర్ లో ‘గాడ్ ఫాదర్’ విడుదలకు ముస్తాబవుతోంది. అదే స్పీడ్ లో భోళాశంకర్, బాబి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నారట.

చేతిలో ఉన్న నాలుగు చిత్రాలు కాకుండా మరో రెండు సినిమాలు త్వరలో అనౌన్స్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల మేకింగ్ లో ఒక మూవీ, అలాగే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారట చిరు.ఇదే స్పీడ్ లో మరో నిర్మాణ సంస్థకు డేట్స్ లాక్ చేశారని టాక్‌. దర్శకుడి పేరు ఖరారు అవ్వగానే ఆ ప్రాజెక్ట్ కూడా లాక్ అవుతుందట. మొత్తంగా 2022 నుంచి మళ్లీ మెగా సందడి మొదలు కాబోతోంది. మెగా స్టార్ ఇదే స్పీడ్ కొనసాగిస్తే, ఏడాదికి మూడు లేదా నాలుగు చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు