అల్లుడికి బర్త్‌డే విషెస్‌‌.. థ్యాంక్యూ మామా!

15 Oct, 2020 12:58 IST|Sakshi

మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్. విభిన్న చిత్రాల్లో నటించి మెగా మేనల్లుడు పేరును నిలబెట్టుకున్నాడు. నేడు(గురువారం) సాయి ధరమ్‌ తేజ్‌ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ రోజుతో 34వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న సంద‌ర్భంగా తేజ్‌కు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లుడు తేజూకి స్పెష‌ల్ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో `సోలో బ్రతుకే సో బెటరు` సినిమాలోని `అమృత` పాటను విడుద‌ల చేశారు. చదవండి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా మేనల్లుడు

అదే విధంగా ‘హ్యాపీ బ‌ర్త్‌డే డియర్‌ తేజ్.. సోలోగా ఉన్న‌ప్పుడే ఎంజాయ్ చేయ్. నీ బ్యాచిల‌ర్ లైఫ్ ఇంకొన్ని రోజులే’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా మెగాస్టార్‌ విష్‌ చేయడంతో సాయి ధరమ్‌ తేజ్‌ ఆనందంలో మునిగి తేలాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు మామ‌కు ధన్య‌వాదాలు తెలిపారు. ‘ఇది పుట్టిన రోజు గొప్ప బహుమతి.. ఈ బ‌ర్త్‌డేని  మరింత ప్రత్యేకంగా చేసినందుకు  ధన్యవాదాలు.. మిమల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాను. మీ ఆశీర్వాదం తప్ప ఇంకేదీ అడ‌గ‌ను . థ్యాంక్యూ సో మ‌చ్ మామా’ అంటూ తేజూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ‘ప్రతి రోజు పండగే’ సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను అందుకున్న హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం నటించిన సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి‘అమృత ప్రేమలో విరాట్.. మనసులో మాట’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా