నీరజ్‌ చోప్రా : 'చరిత్ర తిరగరాశావు..దేశం గర్విస్తుంది'

7 Aug, 2021 20:17 IST|Sakshi

నీరజ్‌ చోప్రా అద్భుత విజయంపై ప్రముఖుల ప్రశంసలు

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జావెలిన్‌ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు.100 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున అథ్లెటిక్స్‌ ఫీల్డ్‌ అండ్‌ ట్రాక్‌ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.  23ఏళ్ల నీరజ్ చోప్రా తొలిసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేష్‌, మహేశ్‌ బాబు, ఎస్‌.ఎస్‌. రాజమౌళి సహా పలువురు ప్రముఖులు నీరజ్‌ చోప్రాను అభినందించారు. చిరంజీవి ట్వీట్‌ చేస్తూ.. 'ఇది భారత్‌కు అద్భుతమైన విజయం. ఈ క్షణం రావడానికి 101 ఏళ్లు పట్టింది. నీరజ్‌ చోప్రా..మీరు చరిత్ర లిఖిండమే  కాదు..చరిత్రను తిరగరాశావు' అంటూ ప్రశంసలు జల్లు కురిపించారు. 
 

మరిన్ని వార్తలు