'గాడ్‌ ఫాదర్‌'గా మెగాస్టార్‌.. పోస్టర్‌ విడుదల

21 Aug, 2021 17:52 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఇప్పటికే సోషల్‌మీడియాలో సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. ఆగ‌స్ట్ 22న చిరంజీవి 66వ వసంతంలోకి  అడుగు పెడుతున్నారు. అయితే బర్త్‌డేకు ఒకరోజు ముందుగానే చిరు  అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ వచ్చేసింది. చిరంజీవి 153వ సినిమా టైటిల్‌ను అధికారికంగా అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య  షూటింగ్‌ కంప్లీట్‌ చేసిన చిరంజీవి ప్రస్తుతం మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు ముందుగా ప్రచారంలో ఉన్నట్లుగానే గాడ్‌ ఫాదర్‌ అనే టైటిల్‌ను ప్రకటించారు. దీనికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బ్లాక్‌ క్యాప్‌ పెట్టుకొని స్టైల్‌గా నిల్చొని ఉన్న చిరు లుక్‌ ఆకట్టుకుంటుంది. మోహన్ రాజా ఈ  చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ సంస్థలపై ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

చదవండి : చిరంజీవి బర్త్‌డే: రేపు రానున్న క్రేజీ ఆప్‌డేట్‌
బర్త్‌డే రోజు ఇలా చేయండి.. ఫ్యాన్స్‌కు చిరు పిలుపు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు