చిరు-అక్కీ‌‌-ఫిక్కీ.. ఓ మంచిపని

5 Jun, 2021 17:50 IST|Sakshi

కరోనా టైంలో సినీ సెలబ్రిటీల సాయంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నా.. వాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. టాలీవుడ్​లో మెగాస్టార్​ చిరంజీవి, బాలీవుడ్​లో అక్షయ్​కుమార్ సెకండ్ వేవ్​లో భారీగా సాయం అందిస్తున్న లిస్ట్​లో ఉన్నారు కూడా. అయితే ఈ అగ్ర హీరోలు ఇప్పుడు మరో మంచి పనిలో భాగం కాబోతున్నారు. ‘ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) మీడియా నిర్వహించే ఓ అవేర్​నెస్​ క్యాంపెయిన్​లో వీళ్లు భాగం కాబోతున్నారు.
​  
బాలీవుడ్ సీనియర్​ హీరో అక్షయ్​ కుమార్​ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించబోతున్నాడు. ఈ క్యాంపెయిన్ పేరు ‘కరోనా కో హరానా హై’(కరోనాను ఓడిద్దాం). ఇక మిగతా భాషల నుంచి కూడా అగ్రహీరోలను ఇందుకోసం ఎంపిక చేశారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్​ చిరంజీవి రిప్రజెంట్ చేస్తుండగా, కోలీవుడ్ నుంచి ఆర్య, కన్నడ నుంచి పవర్​ స్టార్​ పునీత్ రాజ్​కుమార్​లు ఇందులో పాల్గొనబోతున్నారు.  ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ను తమ తమ భాషల్లో చెప్పబోతున్నారు ఈ అగ్రహీరోలు.


 
ఈ మహమ్మారి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి లాంటి నిపుణుల సలహాలను వీళ్లు ప్రచారం చేయనున్నారు. మరాఠీ, పంజాబీ, భాషల్లోనూ ఆయా స్టార్లతో ప్రచారం చేయించబోతున్నారు. జూన్ 5 నుంచీ టీవీ, పేపర్, ఇంటర్నెట్ లాంటి మాస్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైన వీళ్లు క్యాంపెయిన్​లో పాల్గొనే స్పెషల్ కరోనా అవేర్ నెస్ యాడ్స్ ప్రసారం అవుతాయి. ఈ కరోనా టైంలో అందరం హెల్త్​వర్కర్స్​కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే కరోనాపై పోరాటం కొనసాగించాలి. అగ్రహీరోల ద్వారా నడిపించే ఈ క్యాంపెయిన్.. మరింత ప్రభావితంగా ఉంటుందని భావిస్తున్నాం అని ఫిక్కీ చైర్​పర్సన్​ సంజయ్​ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: సత్యదేవ్​కి జాక్​పాట్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు