విక్రమ్‌ సినిమా నుంచి అనిరుధ్‌ అవుట్‌

10 Mar, 2021 18:10 IST|Sakshi

చియాన్‌ విక్రమ్‌ 60వ సినిమా షూటింగ్‌ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌కు స్వాగతం చెప్తూ ట్వీట్‌ చేశాడు. కానీ ఈ ట్వీట్‌ అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. కారణం.. ఈ చిత్రానికి గతంలో అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తాడని ప్రకటించారు. కానీ ఏమైందో ఏమోకానీ సడన్‌గా అతడిని సైడ్‌ చేస్తూ సంతోష్‌ పేరును ప్రకటించారు. "అవును, ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు. మమ్మల్ని అర్థం చేసుకుని అండగా నిలిచినందుకు అనిరుధ్‌కు కృతజ్ఞతలు. ఈ రోజే చిత్రీకరణ ప్రారంభమవుతోంది" అంటూ కార్తీక్‌ సుబ్బరాజు ట్వీట్‌ చేశాడు. చిత్రయూనిట్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం అనిరుధ్‌ మాస్‌ బీజీఎమ్‌ మిస్‌ అవుతామని కామెంట్లు చేస్తున్నారు.

ఇక మీ సినిమాలో సిమ్రాన్‌, వాణి భోజన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లలిత్‌ కుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సెవర్‌ స్క్రీన్‌ స్టూడియోపై ఈ సినిమా నిర్మిస్తున్నాడు. మరోవైపు విక్రమ్‌ 'పొన్నియిన్‌ సెల్వన్‌' అనే మరో యాక్షన్‌ డ్రామా సినిమా చేస్తున్నాడు. 

చదవండి: విక్రమ్‌కు సవాలు విసురుతున్న ఇర్ఫాన్‌ పఠాన్‌

అఖిల్‌ పేరు ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్న ఫ్యాన్‌

మరిన్ని వార్తలు