Chiyaan Vikram Heart Attack News: హీరో విక్రమ్‌కు గుండెపోటు

8 Jul, 2022 14:54 IST|Sakshi

స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. విక్రమ్‌కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా నేడు సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్‌ సెల్వన్‌ టీజర్‌ లాంచ్‌కి విక్రమ్‌ హాజరు కావాల్సి ఉండగా ఇలా జరగడంతో ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమిళనాట ఉన్న స్టార్‌ హీరోల్లో చియాన్‌ విక్రమ్‌ కూడా ఒకరు. భాషతో సంబంధం లేకుండా విక్రమ్ తమిళం, తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ  దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటు తెలుగులోనూ విక్రమ్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

కాగా, విక్రమ్‌ ఆరోగ్యంపై వచ్చిన వదంతులను ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం కొట్టిపారేశాయి. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరమేమి లేదని తెలిపారు. సోమవారం కోబ్రా మూవీ ఆడియో ఫంక్షన్‌కి విక్రమ్‌ హాజరయ్యారని, కొంచెం నీరసంగా ఉండటంతో మంగళవారం ఆయన ఆస్పత్రిలో చేరారని తెలిపారు. విక్రమ్‌ని రెండు రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారని, ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారని తెలిపారు.

మరిన్ని వార్తలు