చిత్ర సీమలో కరోనా కలకలం.. హీరో విక్రమ్‌కు పాజిటివ్‌!

16 Dec, 2021 17:56 IST|Sakshi

Hero Vikram Tested Covid Positive: కరోనా మమహ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని అంతా సంతోషపడుతున్న సమయంలో ఒమిక్రాన్‌ మళ్లీ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. సాధారణ ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా వరుసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే యాక్షన్‌ హీరో అర్జున్‌, బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. తాజాగా తమిళ స్టార్‌ హీరో  విక్రమ్‌ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విక్రమ్‌ మేనేజర్‌ సూర్యనారాయణ తెలిపారు. అయితే విక్రమ్‌కి సోకింది సాధారణ కరోనానా లేదా  ఒమిక్రాన్ వేరియంటా? అని నిర్ధారించడానికి ప‌రీక్ష రిపోర్టుల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు తెలుస్తోంది. విక్రమ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు