ఈ ఫోటోలో ఉన్న స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టండి...

12 Jun, 2021 13:10 IST|Sakshi

స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ నటిస్తున్న చిత్రం కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ 20 డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విక్రమ్‌ లుక్‌ను డైరెక్టర్‌ అజయ్‌ షేర్‌ చేశారు. నల్ల గడ్డం, తెల్లని మీసాలతో వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తున్న విక్రమ్‌ కనిపించారు. గతేడాది మార్చి నెలలో రష్యాలో కోబ్రా షూటింగ్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసులు విజృంభించడంతో షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారు.

ప్రస్తుతం పరిస్థితి మళ్లీ సాధారణం అవుతుండటంతో అతి త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నరట చిత్ర బృందం. ఇ​క ఈ మూవీలో విక్రమ్‌ గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మూవీపై అంచనాలను పెంచేసింది. ప్రతీ సినిమాలో ఢిపరెంట్‌ లుక్‌తో మెస్మరైజ్‌ చేసే విక్రమ్‌ ఈ సినిమాలో ఏకంగా 20 గెటప్స్‌లో కనిపించనుండటం విశేషం. ఇక క్రికెట్‌ క్రీడాకారుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్‌పోల్‌ అధికారి పాత్ర పోషిస్తున్న ఇర్ఫాన్‌ ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారు. ఇర్ఫాన్‌తో పాటు దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా వరకూ రష్యాలోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు.

A post shared by R Ajay Gnanamuthu (@aj_gnanamuthu)

చదవండి : హీరోయిన్‌ కడుపులో ట్రైనర్‌ పిడిగుద్దులు.. వీడియో వైరల్‌
ఆ సీన్‌ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు : హీరోయిన్‌

మరిన్ని వార్తలు