గంగవ్వ నోటి వెంట శ్రీవిష్ణు ‘చోర గాథ’

11 Jun, 2021 21:18 IST|Sakshi

శ్రీవిష్ణు హీరోగా హసిత్‌ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన, మేఘా ఆకాశ్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ‘చోర గాథ బై గంగ‌వ్వ‌’ పేరుతో చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇందులో ‘నీకు ఊ.. కొట్టే క‌థ తెలుసా? ఏది చెప్పినా ఊ.. కొట్టాలి’ అని అస‌లు క‌థ మొద‌లు పెడుతుంది గంగ‌వ్వ‌. ‘అన‌గ‌న‌గా ఓ సూర్యుడు ఉంటడు. ఆ సూర్య‌డేమో భూమికి ప్రాణం ఇచ్చాడు. భూమి నుంచి కోతి, బంగారం వచ్చాయి’ అంటూ సాగే ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది.

గంగ‌వ్వ చెప్పుకొచ్చిన ఈ కథ రాజు, దొంగ‌, కిరీటం చూట్టు తిరగనుందనేది అర్థమైంది. చివరకు ఈ మూడింటి మధ్య ఏం జరిగింది, రాజు కిరీటాన్ని ఎత్తుకెళ్లిన‌ ఆ దొంగ దొరుకుతాడా? లేదా? అనే ప్ర‌శ్న‌తో ముగించిన గంగవ్వ చోర గాథ సినిమాపై మరింత ఆస‌క్తిని పెంచుతోంది. విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం టీజ‌ర్ జూన్‌ 18న విడుద‌ల కానుంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో తనికెళ్ల భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ మూవీకి వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు