హీరోగా మారిన జానీ మాస్టర్‌

29 Dec, 2020 00:21 IST|Sakshi
మాస్టర్‌ జానీ, దిగంగనా సూర్యవంశీ

– జానీ మాస్టర్‌

డాన్స్‌ మాస్టర్‌ స్థాయి నుంచి హీరోలుగా, దర్శకులుగా ఎదిగారు ప్రభుదేవా, లారెన్స్‌. తాజాగా డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ హీరోగా మారారు. సుజి విజువల్స్‌ పతాకంపై మురళిరాజ్‌ తియ్యాన దర్శకత్వంలో కె.వెంకటరమణ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయ్యింది. తొలి సీన్‌కి నాగబాబు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చి, గౌరవ దర్శకత్వం వహించారు. జానీ మాట్లాడుతూ – ‘‘నాకు కొరియోగ్రఫీ, డైరెక్షన్‌ అంటే ఇష్టం. యాక్టింగ్‌ అంతగా ఇష్టం లేదని చెప్పాను. కానీ దర్శకుడు చెప్పిన కథ విన్నాక నటించాలని నిర్ణయించుకున్నాను. ‘నువ్వు హీరోగా చేయకపోతే నేనీ సినిమా తీయను’ అని నిర్మాత చెప్పటంతో మరింత కనెక్ట్‌ అయ్యాను’’ అన్నారు. ‘‘జానీ మాస్టర్‌తో ఎప్పటికైనా సినిమా చేయాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు వెంకటరమణ. ‘‘ఈ చిత్రకథ అద్భుతంగా ఉంది’’ అన్నారు కథానాయిక దిగంగనా సూర్యవంశీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు