చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కన్నుమూత

16 Jun, 2022 15:43 IST|Sakshi

Choreographer Thrinath Rao Passed Away In Chennai: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ త్రినాథ్‌ రావ్‌ (69) కన్నుమూశారు. బుధవారం (జూన్‌ 15) ఉదయం గుండెపోటుతో చైన్నైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గురువారం (జూన్ 16) చెన్నైలో త్రినాథ్‌ రావ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉ‍న్నారు. 'చిన్న' పేరుతో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన త్రినాథ్‌ రావ్‌ స్వస్థలం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెం. 

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 500 చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ప్రముఖ హీరో, దర్శకుడు కె. భాగ్యరాజ్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'తూరల్‌ నిన్రు పోచ్చు' మూవీతో నృత్య దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. తమిళ స్టార్ హీరో అజిత్‌ తొలి సినిమా 'అమరావతి'కి త్రినాథ్‌ రావ్‌ కొరియోగ్రఫీ అందించారు. తర్వాత తమిళంలో 'ముందానై ముడిచ్చు', 'దావడి కలవుగల్‌', 'వైదేహి కాత్తిరుందాల్‌', 'వానత్తై పోల' వంటి తదితర చిత్రాలతోపాటు తెలుగులో 'రాణీకాసుల రంగమ్మ' లాంటి పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. 

చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్‌ హాసన్‌
13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి
ముసలిదానివైపోతున్నావ్‌.. అంటూ అనసూయపై కామెంట్లు

 

మరిన్ని వార్తలు