అలాంటివాడిని కూడా ఇంటికి ఆహ్వానించాడు..అది చిరంజీవి సంస్కారం: ఛోటా కె. నాయుడు

9 Oct, 2022 11:15 IST|Sakshi

దసరా సందర్భంగా హైదరాబాద్‌లక్ష హరియాణా గవర్నర్‌ బండారు దత్తత్రేయ నిర్వహించిన అలయ్‌ బలయ్‌ వేడుకలో చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  ఆ వేడుకలో గరికపాటి మాట్లాడుతుంటే.. అక్కడ జనాలు పట్టించుకోకుండా చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూశారు. దీంతో ఆగ్రహించిన గరికపాటి.. చిరంజీవి ఫోటో సెషన్‌ ఆపేసి స్టేజ్‌ మీదకు రాకుంటే..తాను వెళ్లిపోతానని హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులను బాధించాయి. నాగబాబుతో సహా మెగా అభిమానులంతా గరికపాటిపై దండెత్తారు. సోషల్‌ మీడియాలో ఆయనను ట్రోల్‌ చేశారు. చివరకు చిరంజీవికి గరికపాటి క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం చల్లారలేదు.

(చదవండి: గాడ్‌ఫాదర్‌ ఆ రేంజ్‌ బ్లాక్‌బస్టర్‌: చిరంజీవి)

తాజాగా ప్రముఖ ఛాయగ్రాహకుడు ఛోటా కె. నాయుడు కూడా గరికపాటిపై ఫైర్‌ అయ్యాడు. శనివారం జరిగిన ‘గాడ్‌ ఫాదర్‌’ సక్సెస్‌ మీట్‌లో ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ.. ‘ఇండియన్  స్క్రీన్ పై చిరంజీవిగారితో పోలిక పెట్టడానికి ఎవరూ సరిపోరు. ఆల్‌ స్టార్స్‌ చిరంజీవిగారే. రీసెంట్‌గా అభిమానంతో ఫోటోలు తీసుకుంటుంటే... ఆయన ఎవరో.. మాట్లాడేవాడు మహాపండితుడు(గరికపాటి). ఆయన అలా మాట్లాడవచ్చా అండీ. అది తప్పు కదా. అలాంటివాడిని కూడా చిరంజీవి ఇంటికి ఆహ్వానించారు. అది కదా సంస్కారం. ఇది కదా మేం నేర్చుకుంటున్నాం’ అని అన్నారు. ఛోటా కె. నాయుడు అలా మాట్లాడుతున్న సమయంలో చిరంజీవి చేతులెత్తి నమస్కారం పెట్టారు. 

మరిన్ని వార్తలు