ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం

16 Sep, 2021 09:35 IST|Sakshi

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కటుంబంతో కలిసి పర్యాటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకుని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇటీవల బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ను సైతం సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటి అధికారి అడ్డుకుని పాస్‌పోర్ట్‌ అడిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా బుధవారం కరీనా కటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జహంగీర్‌తో కలిసి ఆమె ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

చదవండి: అమ్మతో ఉన్న ఫొటో షేర్‌ చేసిన హృతిక్‌... తడి గోడను పట్టేసిన నెటిజన్‌

అక్కడ సైఫ్, తైమూర్లు ఎటువంటి ఇబ్బందీ లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. అయితే జహంగీర్‌ కేర్‌ టేకర్‌, కరీనాలు వారి వెనకాలే ఉన్నారు. అక్కడ ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ ఆఫిసర్లు కేర్‌ టేకర్‌ను అడ్డుకుని పాస్‌పార్ట్‌ అడిగారు. వారితో మాట్లాడేందుకు ముందుకు వచ్చిన కరీనాను సైతం వారు పాస్‌పోర్ట్‌ అడగడంతో ఆమె చూపించింది. వారు చెక్‌ చేస్తుండగా తన వెనకాలే ఉన్న వారి మేనేజర్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చి ఆమె లోపలికి వెళ్లిపోయింది. ఈ సమయంలో అప్పటికే విమానాశ్రయంలోకి వెళ్లిన సైఫ్ వెనక్కు వచ్చి కరీనా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఇది​ చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సెలబ్రెటీ అని కూడా చూడకుండా తమ బాధ్యతను నిర్వర్తించిన సదరు సెక్యూరిటీ ఆఫీసర్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

చదవండి: ట్రోలింగ్‌పై కరీనా మండిపాటు

A post shared by Varinder Chawla (@varindertchawla)

మరిన్ని వార్తలు