వైరల్‌: సల్మాన్‌ను అడ్డుకున్న సీఐఎస్‌ఎఫ్‌ సెక్యురిటీ అధికారికి రివార్డు

25 Aug, 2021 16:39 IST|Sakshi

బాలీవుడ్‌ ‘భాయిజాన్‌’ సల్మాన్‌ ఖాన్‌ను అడ్డుకున్నసెక్యూరిటీ అధికారిని సత్కరించినట్లు తాజాగా సీఐఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. కాగా ఇటీవల ‘టైగర్‌-3’ షూటింగ్‌ నేపథ్యంలో రష్యా వెళ్లెందుకు న్యూఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన సల్మాన్‌.. కారు దిగి చెకింగ్‌ దగ్గర ఆగకుండానే నేరుగా లోపలికి వెళ్లిపోతున్నాడు. దీంతో అక్కడ ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ అధికారి సల్మాన్‌ను అడ్డుకుని డ్యాక్యూమెంట్స్‌ చూపించాల్సిందిగా కోరారు. దీంతో ఆ అధికారికి అడ్డు చెప్పలేక సల్మాన్‌ డాక్యుమెంట్స్‌ చూపించి లోపలికి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

చదవండి: Salman Khan: చిరు ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీకి సల్మాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

దీంతో సల్మాన్‌ను అడ్డుకున్నందుకు సదరు సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ అధికారి ఇబ్బందుల్లో పడ్డారని, ఆయన ఫోన్‌ను సీజ్‌ చేసి అధికారులు వారించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీఐఎస్‌ఎఫ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. ఈ విషయంలో తమ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. అంతేగాక తన ఫోన్‌ను సీజ్‌ చేయలేదని, కనీసం మందలించడం కూడా జరగలేదని తెలిపారు. ఆయన ఓ సెలబ్రిటీ అనేది సంబధం లేకుండా విధుల్లో తన డ్యూటీని సక్రమంగా నిర్వర్తించినందుకు సదరు అధికారిని సత్కరించి, రివార్డు ప్రకటించినట్లు సీఐఎస్‌ఎఫ్‌ తమ ట్వీట్లో పేర్కొంది. 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు