ఆ ట్విస్ట్‌ తెలిసి వావ్‌ అనుకున్నా!

7 Sep, 2021 05:30 IST|Sakshi
జవ్వాజి రామాంజనేయులు, పృథ్వీ, చిరంజీవి, ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్‌

 – చిరంజీవి

‘‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ స్పోర్ట్స్‌ బేస్డ్‌ ఫిలిం ప్రేక్షకులను నిరాశపరచలేదు. ‘క్లాప్‌’ టీజర్‌ చూస్తుంటే అథ్లెట్‌ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు హీరో చిరంజీవి. ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్‌ జంటగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘క్లాప్‌’. ఐబీ కార్తికేయన్‌ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, రాజశేఖర్‌ రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో  నిర్మించారు. ‘క్లాప్‌’ సినిమా టీజర్‌ను చిరంజీవి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఆది పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుందనిపిస్తోంది. తన పాత్రలో ఉన్న ట్విస్ట్‌ తెలిసి ‘వావ్‌’ అనుకున్నాను. ఇళయరాజాగారు సంగీతం అందించిన ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు