ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్‌ సాంగ్‌, ఈసారి క్లాసికల్‌ టచ్‌తో..!

21 Oct, 2021 08:13 IST|Sakshi

సాయిపల్లవి.. ఈ పేరు వింటే చాలు అందరిలో ఒక జోష్‌ వస్తోంది. తన సినిమా అంటే వెంటనే మనసులో మెదిలేది ఒక్కటే. అదే తనపై ఉండే స్పెషల్‌ సాంగ్‌. ప్రతి సినిమాలోనూ సాయి పల్లవిపై ప్రత్యేకమైన పాటను పెట్టి తమ సినిమాపై అందరి దృష్టి పడేలా చూసుకుంటారు దర్శకులు. అంతేగాక ఆ పాటలు సినిమాకే హైలెట్‌గా నిలవడం విశేషం. ఆమె సాంగ్స్‌ విడుదలయ్యాయంటే చాలు యుట్యూబ్‌ చానళ్లకు పండగే. రికార్డు స్థాయిలో వ్యూస్‌ రాబడుతూ సంచనాలు సృష్టిస్తాయి. దీనికి గతంలో ఆమె నటించి ఫిదా చిత్రంలోని ‘వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే’,  ఇటీవల వచ్చిన ‘లవ్‌స్టోరీ’లోని సారంగధరియా పాటలే ఉదహరణ.

చదవండి: మహేశ్‌ బాబును లాభాల బాట పట్టించిన ‘లవ్‌స్టోరీ’

ఈ పాటలు జనాల్లోకి, యుట్యూబ్‌ చానళ్లో ఎంతగా దూసుకుపోయాయే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి నాని సరసన ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా సాయి పల్లవిపై ఓ స్పషల్ సాంగ్‌ ఉండబోతుందట. కలకత్తాలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. క్లాసికల్‌ డ్యాన్స్‌ నేపథ్యంలో సాగే ఈ పాటలో సాయి పల్లవి మరోసారి తన డ్యాన్స్‌ స్కిల్స్‌తో అదరగొట్టబోతుందట. ఈ పాట కూడా సినిమాకు హైలెట్‌గా నిలవడం ఖాయం అంటున్నారు. కాగా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న ఈ మూవీ విడుదల కానుంది. 

చదవండి: 'శ్యామ్ సింగరాయ్' నుంచి బిగ్‌ అప్‌డేట్‌

మరిన్ని వార్తలు