డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ భామలకు క్లీన్‌ చిట్‌?

30 Sep, 2020 15:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే.  మాదకద్రవ్యాల కేసులో ఇప్ప‌టికే  రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొంతమందిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకొని వారి నుంచి కీల‌క స‌మాచారాన్ని రాబడుతున్నారు.  విచారణలో రియా వెల్లడించిన కొన్ని విషయాల ఆధారంగా కొంతమంది హీరోయిన్లు ర‌కుల్‌, దీపికా ప‌దుకొణే, సారా అలీ ఖాన్ , శ్ర‌ద్ధా క‌పూర్‌ వంటివారికి ఎన్‌సీబీ బృందం విడివిడిగా విచారించడం మొదలుపెట్టింది. 

అయితే వీరిని విచారించిన అనంతరం బాలీవుడ్‌ భామలకు ఊరట లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎన్‌సీబీ అధికారి ఒకరు తెలిపారు. దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్‌ల‌తో పాటు దీపిక  మేనేజర్ కరిష్మా ప్రకాష్ లకు ఎన్‌సీబీ దాదాపు క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్టే అని ఎన్సీబీ అధికారి ఒక‌రు వెల్లడించారు. 2017 వాట్స‌ప్ చాట్‌లో దీపికా, ఆమె మేనేజ‌ర్ వాల్‌, మాల్‌, వీడ్‌, హాష్‌, డూంబ్ అనే పదాల‌ను ఉపయోగించార‌ని ఎన్‌సీబీ విచారణలో వెల్లడయ్యింది. అయితే అవి వివిధ ర‌కాల సిగ‌రెట్ల కోసం స‌రాదాగా కోడ్‌తో పిలుచుకున్నామని దీపికా, ఆమె మేనేజర్‌ విచారణలో తెలిపినట్లు తెలిసింది. . స్లిమ్ సిగ‌రెట్స్ కోడ్‌గా హ్యాష్‌, మంద‌పాటి సిగ‌రెట్ల‌కు కోడ్‌గా వీడ్, త‌క్కువ నాణ్య‌త గ‌ల సిగరెట్ల‌ను మాల్ ఇలా ప‌లు రకాలుగా వారు పిలుచుకునే వారని తెలిపారు. దీపికా, ప్ర‌కాశ్‌ల‌ను వేర్వేరు గ‌దుల‌లో ఉంచి విచారించ‌గా, వారి ఇచ్చిన స‌మాధానాలు ఒకేలా ఉన్నాయని వీటితో ఎన్‌సీబీ అధికారులు సంతృప్తి చెందినట్లు ఒక అధికారి తెలిపారు.  మ‌రి కొద్ది రోజుల‌లో వీరికి క్లీన్ చీట్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తుందని చెప్పారు. అదే జరిగితే ఇక బాలీవుడ్‌ భామలకు డ్రగ్స్‌ కష్టాలు తప్పినట్లే. 

చదవండి: 3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా