Krishnam Raju Funeral: అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు.. సీఎం ఆదేశం

11 Sep, 2022 12:08 IST|Sakshi

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వస విడిచారు. ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలించారు. అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు  నివాళులు అర్పించారు. కృష్ణంరాజు భౌతికకాయాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలాదేవీ కన్నీరుమున్నీరుగా విలపించారు.

కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్రమంత్రలు కిషన్‌రెడ్డి, సినీ నటులు మోహన్‌ బాబు, ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు నివాళులర్పించారు. రేపు మధ్యాహ్నం అభిమానుల కడసారి చూపుకోసం కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అటునుంచి మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కాగా రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల​ఓనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు తనకు అత్యంత అప్తమిత్రుడని కేసీఆర్ పేర్కొన్నారు.

ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు. చదవండి: మా ఊరి హీరో కృష్ణంరాజు.. నన్ను పెద్దన్నలా ప్రోత్సహించారు: చిరంజీవి 

మరిన్ని వార్తలు