అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన కలర్స్‌ స్వాతి, మూవీ స్టిల్‌ లీక్‌!

30 Jun, 2021 21:56 IST|Sakshi

కలర్స్‌ స్వాతి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా కెరియర్‌ స్టార్ట్‌ చేసి హీరోయిన్‌గా ఎదిగిన ఆమె అష్టాచమ్మాలో మహేశ్‌.. మహేశ్‌ అంటూ ప్రేక్షకులను అలరించింది. ఎప్పుడు తన చలాకీ మాటలతో తనదైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణను పొందిన స్వాతి 2018లో పైలట్‌ వికాస్‌ వాసును వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇండోనేషియాకు మకాం మార్చిన ఆమె అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది. పెళ్లి అనంతరం కాస్త బొద్దుగా మారిన స్వాతి సినీ కేరీర్‌ ముగిసినట్లేనని అందరూ భావించారు. అయితే వాటన్నింటికి చెక్‌ పెడుతూ స్వాతి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

‘పంచతంత్రం’ మూవీతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనుంది. తాజాగా స్వాతి పంచతంత్రం మూవీ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలు బయటకు వచ్చాయి. సెట్స్‌లో ఓ సన్నివేశానికి సంబంధించిన స్టిల్‌ లీక్‌ కాగా.. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల బొద్దుగా తయారైన స్వాతి ఈ తాజా స్టిల్‌లో ఒకప్పటి స్వాతిలా సన్నగా నాజుగ్గా దర్శనం ఇచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. చాలా గ్యాప్‌ తర్వాత స్వాతిని ఇలా చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. ఇక తిరిగి తను సినిమాల్లో నటిస్తుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: 
రాధే శ్యామ్‌ క్లైమాక్స్‌ సీన్‌ లీక్‌, కన్నీరు పెట్టించే ప్రేరణ మృతి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు