నా మేనకోడలిని ఆశీర్వదించండి: అలీ

8 Dec, 2020 21:44 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి(తూర్పు గోదావరి జిల్లా):  ప్రముఖ హాస్యనటుడు అలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అలీ పెద్దక్క కూతురు సల్మా వివాహం సోమవారం రాత్రి రాజమండ్రిలో జరిగింది. సల్మా, అహ్మద్‌ అలీల పెళ్లి  వేడుకలో రాజమండ్రి ఎంపీ మర్గాని భరత్‌, ఇతర ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. సల్మాకు తండ్రి లేకపోవటంతో తండ్రి స్థానాన్ని మేనమామ అలీ తీసుకుని పెళ్లి వేడుకని అంగరంగా వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు అందరి దీవెనలు ఉండాలని అలీ కోరుకున్నారు.

మరిన్ని వార్తలు