ప్రముఖ కమెడియన్‌ అరెస్ట్‌

21 Nov, 2020 19:30 IST|Sakshi

ముంబై : ప్రముఖ కమెడియన్ భారతి సింగ్‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం భారతీ సింగ్‌ ఇంటిపై ఎన్‌సీబీ అధికారులు దాడి చేశారు. ఆమె ఇంట్లో కొద్ది మొత్తంలో గంజాయి దొరికినట్లు అధికారులు వెల్లడించారు. సోదాల అనంతరం  భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాను అదుపులోకి తీసుకొని ప్రశ్నలు వర్షం కురిపించారు. అనంతరం భారతీ సింగ్‌తో పాటు ఆమె భర్త హర్ష్ లింబాచియాను అరెస్ట్‌ చేసి ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి తరలించారు.  భారతీ సింగ్‌ ఇంట్లో నిషేధిత మాదక ద్రవ్యాలు లభించడంతో వారిని విచారణకు పిలిచాం అని ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖెడే తెలిపారు.

కాగా, శుక్రవారం రాత్రి కూడా ముంబైని పలుప్రాంతాల్లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఓ డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి విచారణలో భారతి పేరు రావడంతో.. శనివారం అంధేరిలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్‌ చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్‌  ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించింది. ఈ నెల ప్రారంభంలో నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్‌సీబీ దాడులు చేసింది. రాంపాల్‌, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్‌సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్‌లో భాగమని రాంపాల్‌ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు