ప్యాన్‌ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు: పృథ్వీ

28 Aug, 2021 08:57 IST|Sakshi

‘‘ప్యాన్‌ ఇండియా సినిమాల ప్రారంభోత్సవాలకు మమ్మల్ని పిలవరు.. నన్ను పిలిచిన సినిమాలకు సపోర్ట్‌ అందించాలనే ‘కాలం రాసిన కథలు’ ప్రారంభోత్సవానికి వచ్చాను. సినిమాల్లో చిన్నా పెద్దా అనేది ఉండదు. ఏ సినిమాకైనా ఒకే కెమేరా, ఒకే కష్టం ఉంటుంది’’ అన్నారు నటుడు పృథ్వీరాజ్‌. వెన్నెల, రీతు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘కాలం రాసిన కథలు’.

బేబీ శాన్వి శ్రీ షాలిని సమర్పణలో ఎమ్‌ఎన్‌వీ సాగర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. తొలి సీన్‌కి వెంగళరావు నగర్‌ కార్పొరేటర్‌ దేదీప్య విజయ్‌కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, పృథ్వీరాజ్‌ క్లాప్‌ ఇచ్చారు. ‘‘ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వని ధైర్యం కుటుంబం మాత్రమే ఇవ్వగలదు అనేదే ‘కాలం రాసిన కథలు’ కథ’’ అన్నారు సాగర్‌.

చదవండి : హీరోగా హరనాథ్‌ వారసుడు
‘‘7 డేస్‌ 6 నైట్స్‌’ షూటింగ్‌ పూర్తి..ఎం.ఎస్‌ రాజు ఎమోషనల్‌

మరిన్ని వార్తలు