Raju Srivastava Health Update: నటుడికి గుండెపోటు, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు

11 Aug, 2022 11:17 IST|Sakshi

ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్‌ కమెడియన్‌ రాజు శ్రీవాస్తవ బుధవారం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఎయిమ్స్‌ వైద్యులు ఆయన హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. రాజు శ్రీవాస్తవకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు.

చదవండి: జిమ్‌ చేస్తుండగా నటుడికి గుండెపోటు

ప్రస్తుతం ఆయన వెంటిలెటర్‌పై ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయన నిన్న ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. ట్రెడ్‌మిల్‌పై వ్యాయమం చేస్తుండగా ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. దీంతో ఆయన ట్రైనర్‌ రెండుసార్లు సీపీఆర్‌ చేసి ఆనంతరం ఆస్పత్రికి తరలించినట్లు శ్రీవాస్తవ పీఆర్‌ అజిత్‌ సక్సేనా తెలిపారు. 

మరిన్ని వార్తలు