కమెడియన్‌ చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు

6 May, 2021 13:56 IST|Sakshi

ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయ తాండవం సృష్టిస్తుంది. ఇప్పటికే సామన్యులు సహా కొందరు సెలబ్రిటీలు కూడా కోవిడ్‌ బారిన పడుతున్నారు. తాజాగా సినీ ద‌ర్శ‌కుడు, ర‌చయిత నంద్యాల ర‌వికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకి ప్రైవేటు ఆసుపత్రిలో చేరాల్సి రావడంతో ఆసుపత్రి బిల్లు 6నుంచి 7 లక్షల దాకా అయినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న కమెడియన్‌ సప్తగిరి వెంటనే తన వంతు సాయంగా రవి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.  ఇక గతంలోనూ కరోనా నేపథ్యంలో సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి కూడా సప్తగిరి తన వంతు విరాళంగా 2 లక్షల రూపాయలు అందించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రవి కుటుంబానికి కూడా తన వంతు సాయాన్ని అందించి మరోసారి సప్తగిరి మానవత్వాన్ని చాటుకున్నారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి : అడివి శేష్ పెద్ద మనసు.. వారికోసం ఏకంగా వాటర్‌ ప్లాంట్‌..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు