హీరోగా ఎంట్రీ ఇస్తున్న కమెడియన్‌ కొడుకు

16 Sep, 2023 12:13 IST|Sakshi

తమిళసినిమా: కమెడియన్‌ తంబి రామయ్య వారసుడు ఉమాపతి తంబిరామయ్య కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం పిత్తల మాత్తి. మాణిక్య విద్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ శరవణ ఫిలిం ఆర్ట్స్‌ పతాకంపై జి.శరవణన్‌ నిర్మించారు. నటి సంస్కృతి నాయకిగా నటించిన ఇందులో బాలశరవణన్, వినుతాలాల్, తంబి రామయ్య, దేవదర్శిని, విద్యుత్‌ లేఖారామన్, ఆడుగలం నరేన్, కాదల్‌ సుకుమార్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మోసస్‌ సంగీతాన్ని, ఎస్‌ఎన్‌ వెంకట్‌ ఛాయాగ్రహణం అందించారు.

నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న పిత్తల మాత్తి చిత్రం ఈనెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను నిర్మాత శరవణన్‌ తెలుపుతూ ఒక యువకుడు మంచి కోసం ఏమేమి చేయాల్సి వచ్చింది వివరించే కథాచిత్రంగా ఇది ఉంటుందన్నారు. అతను ఏది మంచి ఏది చెడు తెలుసుకుని జీవితంలో పైకి రావడానికి ఏం చేశాడు అనే పలు ఆసక్తికరమైన సంఘటనలతో చిత్రం సాగుతుందన్నారు. చిత్రాన్ని ఈనెల 28న తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

మరిన్ని వార్తలు