హీరోగా చంద్రబాబు మనవడు

30 Nov, 2022 07:31 IST|Sakshi
తెర్కత్తివీరన్‌ చిత్ర యూనిట్‌  

దివంగత హాస్య నటుడు చంద్రబాబును తమిళ సినిమా ఎప్పటికీ మర్చిపోదు. కాగా ఆయన వారసత్వాన్ని ఆయన మనవడు సారత్‌ తన భుజాలపైన వేసుకున్నారు. తెర్కత్తివీరన్‌ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత, కథానాయకుడు అన్నీ తానే కావడం విశేషం. ఈయన ఇంతకు ముందు ఏ దర్శకుడి వద్ద పని చేయలేదు.

చంద్రబాబు ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కథానాయకుడికి స్నేహితులుగా మురుగా అశోక్, నాడోడిగళ్‌ భరణి, మారి వినోద్‌ నటించగా హీరో తండ్రిగా వేల రామ్మూర్తి నటించారు. అదే విధంగా మధుసూదనన్, కబీర్‌ తుహాన్‌ సింగ్, పవన్, ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్, నమో నారాయణ, రాజసింహన్, ఆర్యన్, రేణుక, ఉమా పద్మనాభన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ దేవా సంగీతాన్ని, ఎన్‌. షణ్ముఖ సుందరం చాయాగ్రహణను  అందించారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌  2వ తేదీ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటుడు సారత్‌ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది తూత్తుకుడి నేపథ్యంలో యథార్థ సంఘటనలతో రూపొందించిన చిత్రం అని చెప్పారు. హీరో నలుగురు మిత్రులు ఐదుగురు పిల్లల మధ్య పగ, ప్రతీకారం ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. ఐదు పాటలు ఎనిమిది ఫైట్లు అంటూ పక్కా కమర్షియల్‌ ఫార్మెట్లో తెరకెక్కించిన చిత్రం తెర్కత్తి వీరన్‌ తెలిపారు. చిత్రంలో కడవలమ్మ అనే ఇంట్రో సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవా పాడారని చెప్పారు. ఈ పాటలో శ్రీకాంత్‌ దేవా తనతో కలిసి నటించడం మరో విశేషం అని పేర్కొన్నారు. 

చదవండి: (రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?)

మరిన్ని వార్తలు