నేరగాడిగా చిత్రీకరించే ఆ వ్యాఖ్యలు నొప్పించాయి: విజయ్‌ ఆవేదన

26 Oct, 2021 07:36 IST|Sakshi

సాక్షి, చెన్నై: తనను నేరగాడిగా చిత్రీకరించే రీతిలో సింగిల్‌ బెంచ్‌ చేసిన వ్యాఖ్యలు మనస్సును నొప్పించాయని సినీ నటుడు విజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో విజయ్‌ ఇంగ్లండ్‌ నుంచి ఓ లగ్జరీ కారును దిగుమతి చేసుకున్నారు. దీనికి దిగుమతి సుంకం రద్దు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కొన్ని నెలల క్రితం పిటిషన్‌ విచారణ సమయంలో సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి ఎస్‌ఎం సుబ్రమణ్యం అక్షింతలు వేశారు.

దిగుమతి సుంకం చెల్లించాల్సిందేనని ఆదేశిస్తూ, అదనంగా రూ.  లక్ష జరిమానాను సైతం విధిస్తూ పరోక్షంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.  దీంతో దిగుమతి సుంకం రూ. 32.30 లక్షలను విజయ్‌ చెల్లించారు. అయితే, న్యాయమూర్తి గత తీర్పులో పేర్కొన్న అంశాల్ని రద్దు చేయాలని కోరుతూ కొత్త పిటిషన్‌ దాఖలు చేశారు.

చదవండి: (స్వగ్రామానికి రాజ్‌ కిరణ్‌ మృతదేహం.. సీఎం స్టాలిన్‌ రూ. పది లక్షల సాయం)

న్యాయమూర్తులు పుష్పా సత్యనారాయణన్, మహ్మద్‌ సఫిక్‌ నేతృత్వంలోని బెంచ్‌ముందు సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయ్‌ తరపున సీనియర్‌ న్యాయ వాది విజయనారాయణన్‌ వాదనను వినిపించారు. గతంలో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తీర్పు నుంచి రద్దు చేయాలని వాదించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు