ఆర్‌ఆర్‌ఆర్‌ టీజర్‌పై సీతక్క ట్వీట్‌

22 Oct, 2020 16:48 IST|Sakshi

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. జూనియర్‌  ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాహుబలి వరుస హిట్స్‌ అనంతరం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.  ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు, మన్యం​ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌ చరణ్‌ నటిస్తుండగా.. మన్యంపులి కొమురం భీం పాత్రలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొమురం భీం జయంతి సందర్భంగా చిత్ర యూనిట్‌ ఎన్టీఆర్‌పై ఓ టీజర్‌ను విడుదల చేసింది. రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఇచ్చిన ఈ టీజర్‌లో ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో ఒదిగిపోయాడు. [ చదవండి : ఆర్ఆర్ఆర్‌ టీజ‌ర్‌: ఇవ‌న్నీ ఇప్ప‌టికే చూసేశాం, ఆ అగ్నిప‌ర్వ‌తం ఆ ఛాన‌ల్‌లోదే

అభిమానుల భారీ అంచనాల నడుము విడుదలైన ఈ టీజర్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు సైతం చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. దీనిలో  భాగంగానే ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకురాలు సీతక్క సైతం ట్విటర్‌ వేదికగా స్పందించారు. కొమురం భీం పాత్రపై విడుదల చేసిన టీజర్‌ను జోడిస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీంకు అభినందనలు తెలిపారు.‘మన్యం ముద్దుబిడ్డ. మా అన్న, మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు. మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు’ అని ట్వీట్‌ చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు