‘ది కంజురింగ్‌’ సీక్వెల్‌ హర్రర్‌ చిత్రం విడుదల రేపే

12 Aug, 2021 11:28 IST|Sakshi

హాలీవుడ్‌ చిత్రాల్లో ‘ది కంజురింగ్‌’.. హర్రర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాలకు పరాకాష్ట అని చెప్పుకొవచ్చు. అలా ‘ది కంజురింగ్‌’ పార్ట్‌-1, పార్ట్‌-2 ప్రపంచ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఇప్పుడు వాటికి సీక్వెల్‌గా ‘ది కంజురింగ్‌: ది డెవిల్‌ మేడ్‌ మీ డు ఇట్‌’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ రెండు పార్ట్స్‌ను తెరకెక్కించిన దర్శక-నిర్మాత మైఖేల్‌ ఛావెస్‌యే ఈ మూవీ రూపొందించాడు. పార్ట్‌-1, పార్ట్‌-2 చిత్రాలకంటే ‘ది కంజురింగ్‌: ది డెవిల్‌ మేడ్‌ మీ డు ఇట్‌’ చిత్రాన్నిప్రత్యేకంగా తెరెక్కించినట్లు దర్శకుడు పేర్కొన్నాడు. కాగా ప్రముఖ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ ఈ మూవీని దేశంలోని ముఖ్యమైన నగరాల్లో ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు