కౌన్‌ బనేగా కరోడ్‌పతి.. చిక్కుల్లో ప్రభుత్వ ఉద్యోగి..

31 Aug, 2021 21:07 IST|Sakshi

Kaun Banega Crorepati: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్‌ రియాలిటీ క్విజ్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ). ప్రస్తుతం కేసీబీ 13వ సీజన్‌ కొనసాగుతోంది. అయితే ఇటీవల ఈ షోలో పాల్గొన్న ఓ రైల్వే అధికారి చిక్కుల్లో పడ్డాడు. అయితే ఆయన సరైన సమాధానం చెప్పనందు వల్ల కాదు.. షోలో పాల్గోనందుకు. కంటెస్టెంట్‌ దేశ్‌ బంధ్‌ పాండే కేబీసీలో పాల్గొని.. బిగ్‌ బీ అడిగిన పది ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.3,40,000 గెలుచుకొని ఇంటి ముఖం పట్టాడు. కేబీసీలో పాల్గొని అమితాబ్‌ బచ్చన్‌ను కలవాలన్న తన కలను దేశ్‌ పాండే నెరవేర్చుకున్నారు. దేశ్‌ పాండే వృత్తి రీత్యా రైల్వే ఉద్యోగి.

అయితే తాను పని చేస్తున్న రైల్వే అడ్మినిస్ట్రేషన్ అతనికి షాక్‌ ఇచ్చింది. కేబీసీలో పాల్గొన్నందుకు ఆయనకి చార్జ్‌షీట్‌ పంపించింది. కేబీసీ షోలో పాల్గొనడానికై రాజస్థాన్‌లో కోటా నుంచి దేశ్‌ పాండే ముంబైకి వచ్చారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 13 వరకు ఆయన ముంబైలో ఉన్నారు. షోలో పాల్గొనేందుకు దేశ్‌ పాండే తన ఉన్నతధికారుల వద్ద సెలవుల కోసం అప్లికేషన్‌ పెట్టాడు.

చదవండి: కాజోల్‌ను నాతో చూడగానే కోపం తెచ్చుకునేవాడు: షారుక్‌

అయితే ఉన్నతధికారులు ఆయన సెలవుల అప్లికేషన్‌ను పరిగణలోకి తీసుకోలేదు. అనంతరం ఆయన కేబీసీ షోలో పాల్గొన్నారు. దీంతో రైల్వే అడ్మినిస్ట్రేషన్‌ ఆయనకు చార్జ్‌ షిట్‌ను పంపించింది. అయితే విషయంపై  రైల్వే ఉద్యోగులు.. అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.

పశ్చిమ మధ్య రైల్వే మజ్దూర్ సంఘ్ డివిజనల్‌ సెక్రటరీ ఖలీద్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. దేశ్‌ పాండేపై రైల్వే అడ్మినిస్ట్రెషన్‌ ఎప్పుడూ సరిగా వ్యవహరించలేదన్నారు. ఆయన బిహార్‌లోని పట్నాలో పుట్టి పెరిగారని, రైల్వేలో ఆయన ఆఫీస్ సూపరింటెండెంట్‌ అని తెలిపారు. ఉద్యోగం కోసం దేశ్‌ పాండే గత 13 ఏళ్ల నుంచి రాజస్థాన్‌లోని కోటాలో ఉంటున్నారని పేర్కొన్నారు.  

చదవండి: పోర్నోగ్రఫీ: ప్రొడక్షన్‌ హౌజ్‌పై మాజీ మిస్‌ యూనివర్స్‌ సంచలన వ్యాఖ్యలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు