అనుకున్నదొకటి అయింది మరొకటి.. సందడే కరువాయే!

12 Jan, 2022 17:23 IST|Sakshi

సంక్రాంతి పండగ సరదాలు, సంబరాల్లో  ప్రధానం భాగం సినిమాలు. సంక్రాంతి పండగ వచ్చిందంటే కొత్త సినిమా రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే దర్శక నిర్మాతలతోపాటు చిన్న హీరోల నుంచి స్టార్‌ హీరోల దాకా పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతాయి.  బాక్సాఫీసు వసూళ్లను కొల్లగొడతాయి. బిగ్‌ మూవీలయితే రిలీజ్ డేట్ ను ప్రకటించి మరీ వార్‌ వన్‌సైడే అనిపించేవి. అయితే ఉన్నట్టుండి 2022 సంక్రాంతి వార్‌ మాత్రం గందరగోళంగా మారిపోయింది. సందడి చేస్తారనుకున్న స్టార్ హీరోలు సైడైపోవడంతో  చిన్న సినిమాలతోనే ఫాన్స్  సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

టాలీవుడ్‌లో కరోనా మహమ్మారి  కారణంగా పెద్ద సినిమాలన్నీ వాయిదా పడక తప్పని పరిస్థితి నెలకొంది. ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలుపెట్టుకున్న సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సంక్రాంతి  రేసు నుంచి తప్పుకుంటున్నట్టు  ప్రకటించాయి. చివరికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు కూడా వాయిదా పడటం సంక్రాంతి ఉత్సాహాన్ని మరింత నీరుగార్చేసింది.  అయితే అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటిస్తున్న బంగార్రాజు సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 14న విడుదలకు సిద్ధమవుతుండటం కాస్త ఊరటనిస్తోంది. ఇప్పటికే ఈ మూవీలోని పాటలు, టీజర్లతో హడావిడి చేసింది.

మరిన్ని వార్తలు