త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి కరోనా నెగెటివ్!‌

10 Apr, 2021 17:45 IST|Sakshi

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ సునామీ సృష్టిస్తోంది. సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన కరోనా.. ఇప్పుడు టాలీవుడ్‌ మీద దాడి చేస్తుంది. టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు కోవిడ్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా క‌రోనా బారిన ప‌డ్డార‌ట‌. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. గత పది రోజులుగా ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందారు. దీనిపై అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన రాలేదు.

అయితే తాజాగా ఆయన కరోనా నిర్థారణ పరీక్ష చేయించుకోగా, నెగెటివ్‌ అని వచ్చిందట. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే తిరిగి తన పనులు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం ఆయన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రానికి మాట‌లు అందిస్తున్నాడు. త్వరలో ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత మ‌హేశ్‌ బాబుతో ఓ సినిమా చేయ‌నున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు