నా సోదరుడిని కాపాడుకోలేకపోయాను: నటుడు ఎమోషనల్‌

23 Apr, 2021 11:15 IST|Sakshi

భోజ్‌పురి గేయ రచయిత శ్యామ్‌ దేహాటి మృతి

భావోద్వేగానికి లోనైన భోజ్‌పురి సూపర్‌ స్టార్‌ కేసరిలాల్‌ యాదవ్‌

ప్రముఖ భోజ్‌పురి గేయ రచయిత శ్యామ్‌ దేహాటి ఇటీవలే కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన భోజ్‌పురి సూపర్‌ స్టార్‌ కేసరిలాల్‌ యాదవ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వీడియోను రిలీజ్‌ చేశాడు. ఇందులో తన ప్రియ ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు శ్యామ్‌ దేహాటిని గుర్తు చేసుకున్నాడు. తన సోదరుడిని కాపాడలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడికి భార్యాపిల్లలు ఉన్నారని, వాళ్లు సైతం కరోనాతో బాధపడుతున్నారని తెలిపాడు. శ్యామ్‌ను కాపాడుకోలేకపోయిన తాను కనీసం అతడి కుటుంబాన్ని అయినా ఆదుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో అభిమానుల మనసులను కదిలించి వేస్తోంది.

కాగా కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న శ్యామ్‌ కొన్నాళ్ల క్రితం ఓ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడట. కానీ, అంతలోనే కరోనా బారిన పడి సోమవారం గోరఖ్‌పూర్‌లో తుది శ్వాస విడిచాడు. ఇతడి మృతి పట్ల భోజ్‌పురి ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టాప్‌ సెలబ్రిటీలు పవన్‌ సింగ్‌, దినేశ్‌ లాల్‌ యాదవ్‌, రితేశ్‌ పాండే, అర్వింద్‌ అకేలా కల్లు, రాణీ చటర్జీ, కాజల్‌ రాఘ్వానీ సహా పలువురు శ్యామ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

చదవండి: క్వారంటైన్‌లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్‌

ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు