కోవిడ్‌ కల్లోలం.. ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ చేయూత

10 May, 2021 17:45 IST|Sakshi

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు శ్వాస తీసుకోలేని పేషంట్లకు ఆక్సిజన్ దొరకడం కష్టతరమైంది. మ‌హ‌మ్మారి నుంచి దేశాన్ని రక్షించేందుకు సెలబ్రిటీలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. తమకు తోచినంత విరాళాన్ని ప్రకటించడంతోపాటు కోవిడ్‌ ఫండ్‌ రైజింగ్‌ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌ చేరింది. రాధే శ్యామ్‌ నిర్మాత‌లు కోవిడ్ బాధితుల కోసం సరికొత్త నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమాలో హాస్పిట‌ల్ సీన్ కోసం 50 సెట్ ప్రాప‌ర్టీల‌ను రూపొందించారు. ఇందులో బెడ్స్, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్, స్ట్రెచ‌ర్స్, మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్స్, పీపీఈ కిట్లు ఉన్నాయి. వీట‌న్నింటిని కోవిడ్‌ రోగుల కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. నగరంలోని ప్రైవేటు స్టూడియోలో నిర్మించిన ఈ సెట్‌లో షూటింగ్‌ పూర్తయింది. అనంతరం సెట్‌ను తొలగిద్దామనుకున్న సమయంలో కోవిడ్‌ కేసులు పెరడగం ప్రారంభమైంది. దీంతో సెట్‌లోని ప్రాపర్టీని ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని రాధేశ్యామ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ రెడ్డి  ధ్రువీకరించారు.

చదవండి: 
ఇప్పుడు 5 కోట్లు తీసుకునే పూజా హెగ్డే.. తొలి సంపాదన ఎంతో తెలుసా?

సెలబ్రిటీలకు తగ్గని సల్మాన్‌ బాడీగార్డ్‌ జీతం..ఎంతో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు