CPI Narayana: బిగ్‌బాస్‌ షోపై మళ్లీ రెచ్చిపోయిన నారాయణ.. షోపై షాకింగ్‌ కామెంట్స్‌

5 Sep, 2022 13:19 IST|Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ షోకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20మంది కంటెస్టెంట్లు, వందరోజులకు పైగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-6 గ్రాండ్‌గా లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. పిల్లల నుంచి పెద్దవాళ్లదాకా బిగ్‌బాస్ కోసం ఎదురుచూసే జనం కోట్లలో ఉంటే మరోపక్క ఈ షోని విమర్శించే వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. బిగ్‌బాస్‌ వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేదని ఈ షోను బ్యాన్‌ చేయాలంటూ కొందరు ట్రోల్‌ చేస్తుంటారు.

తాజాగా బిగ్‌బాస్‌ షోపై మరోసారి తన ఆగ్రహం వెళ్లగక్కారు సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ .'కాసులకు కక్కుర్తి పడేవాళ్లున్నంతకాలం ఇలాంటి షోలు ఉంటాయి.  బిగ్‌బాస్‌ షోతో ఏం సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాలి. బిగ్‌బాస్‌ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా? అదొక అనైతిక షో. వింత జంతువులు ఈ హౌస్‌లోకి వచ్చాయి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా సీపీఐ నారాయణ గతంలోనూ బిగ్‌బాస్‌ షోపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు