Ram Charan RC 15 Title: రామ్‌ చరణ్‌, శంకర్‌ సినిమా టైటిట్‌ ఇదేనా?

18 Jun, 2022 10:15 IST|Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.  ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్‌. ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్‌ వినిపించాయి.

(చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్‌ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్‌)

తాజాగా ‘అధికారి’ అనే టైటిల్‌ తెరపైకి వచ్చింది. చరణ్‌ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారు కాబట్టి ఈ టైటిల్‌ సరిపోతుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ టైటిల్‌కి పాన్‌ ఇండియా అప్పీల్‌ కూడా ఉంటుందని భావిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌కి పూర్తవుతుందని టాక్‌. 

మరిన్ని వార్తలు