Criminal Movie 2022: క్రైమ్‌ థ్రిల్లర్స్‌కు ఓటీటీలో ఆదరణ పెరుగుతోంది: నిర్మాత

28 May, 2022 12:01 IST|Sakshi

చెన్నై సినిమా: క్రిమినల్‌ వంటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోందని నిర్మాత ధనుంజయన్‌ తెలిపారు. కమలా ఆర్ట్స్‌ పతాకంపై మహేష్‌ సిపి నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం క్రిమినల్‌. ఆరుముగన్‌ దర్శకత్వం వహించిన చిత్రంలో హీరోయిన్‌గా కొత్త నటి జానవి నటించింది. పీఆర్‌వో అశ్వద్‌ పెస్సీ, ఎం.ఎన్‌.అరవింద్, షైనీ సీ జార్జ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.  

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణను గురువారం చెన్నైలో నిర్వహించారు. నిర్మాత ధనుంజయన్‌ మాట్లాడుతూ చిత్ర ట్రైలర్, పాటలు బాగుండటంతో పాటు చిత్రాన్ని చూడాలన్న ఆసక్తి కలుగుతోందన్నారు. 

చదవండి: త్వరలో పెళ్లి !.. అంతలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు

మరిన్ని వార్తలు