సల్మాన్‌ బర్త్‌డే: అభిమానులపై పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్‌

27 Dec, 2022 21:17 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ 57వ బర్త్‌ డే వేడుకలు ఆయన నివాసంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. బంద్రాలోని ఆయన నివాసం వద్దకు వందల మంది చేరుకున్నారు. బర్త్‌డే సందర్భంగా అభిమానులను పలకరించిన సల్మాన్‌ ఖాన్‌ వారి ఆశిస్సులు తీసుకున్నారు. అయితే, రోడ్డుపై భారీగా జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 

సల్మాన్‌ ఖాన్ తన ఇంటిలోని బాల్కనీ నుంచి కనిపించిన సమయంలో ఆయన అభిమానుల సంతోషానికి ‍అవధులు లేకుండా పోయాయి. బాల్కనీలో నుంచి అభిమానులను పలకరించారు సల్మాన్‌. ఈ క్రమంలో పోలీసుల మాటసైతం లెక్కచేయకుండా రోడ్డుపైకి వచ్చేశారు అభిమానులు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. లాఠీఛార్జి మొదలు పెట్టడం వల్ల అక్కడి నుంచి కొద్ది క్షణాల్లోనే అంతా వెళ్లిపోయారని వెల్లడించారు.

ఇదీ చదవండి: Salman Khan: మాజీ లవర్‌ను ముద్దాడిన సల్మాన్ ఖాన్.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్

మరిన్ని వార్తలు