రాంగ్ గోపాల్‌ వర్మ 

22 Aug, 2020 12:56 IST|Sakshi
ప్రభు, దేవి

సాక్షి, హైదరాబాద్‌: సినీ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు ప్రభు స్వీయ దర్శకత్వంలో​ నిర్మిస్తున్న చిత్రం ‘రాంగ్‌ గోపాల్‌ వర్మ’. ‘షకలక’ శంకర్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వ్యక్తులపై తీసే సినిమాలకు స్వతహాగా నేను వ్యతిరేకమైనప్పటికీ సమాజానికి చీడ పురుగులా దాపురించిన వ్యక్తిపై తీసిన ఈ చిత్రాన్ని స్వాగతిస్తున్నాను. ఈ చిత్రం కోసం ప్రభు రాసిన పాట విన్నాను.. చాలా బాగుంది’ అన్నారు. ‘ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలకు చెంప పెట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. పతాక సన్నివేశాలు, పాట మినహా షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది’ అని ప్రభు అన్నారు. (30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా: వ‌ర్మ‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా