కరోనాపై అవగాహన కల్పించేందుకు ఈసారి ఏం చేసారంటే...

12 May, 2021 15:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ట్రాఫిక్‌ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్‌ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్‌ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్‌, ఫేమస్‌ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్‌ పోలీసులు లేటెస్ట్‌గా మహేష్‌బాబును వాడేశారు.

డెనిమ్‌ జీన్స్‌, జాకెట్‌ వేసుకున్న మహేష్‌బాబు ఫోటోను షేర్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు..'డెనిమ్‌ మీద డెనిమ్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌, మాస్క్‌ మీద మాస్క్‌ సేఫ్టీ ట్రెండ్‌' అంటూ ఓ ఫోటోను షేర్‌ చేశారు.  మహేష్ డెనిమ్‌  జాకెట్‌,  డెనిమ్‌ జీన్స్‌ వేసుకొని ఉన్న మహేష్‌ ఫోటోతో ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ నెటిజన్లు సైబరాబాద్‌ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి : సీఎం కొడుకుతో మూవీ ఛాన్స్‌ కొట్టేసిన శివానీ రాజశేఖర్‌
ఎన్టీఆర్‌కు కరోనా.. హెల్త్‌ అప్‌డేట్స్‌ ఇచ్చిన చిరంజీవి

మరిన్ని వార్తలు