'డాడీ' మూవీలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

18 May, 2021 18:51 IST|Sakshi

చిరంజీవి, సిమ్రాన్‌ జంటగా నటించిన సినిమా డాడీ. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. 2001లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరైంది.తండ్రి-కూతురి మధ్యనుండే ఎమోషన్‌ కథాంశంగా రూపొందించిన ఈ సినిమాలో  చిన్నారి ఐశ్వర్య పాత్ర గుర్తింది కదా.. అదేనండీ చిరంజీవి, సిమ్రాన్‌ల కూతురిగా నటించిన పాప. చిరంజీవి తర్వాత అంతలా ప్రేక్షకులకు దగ్గరైన పాత్ర అది. ఐశ్వర్య, అక్షయలా ద్విపాత్రిభినయంతో ఆకట్టుకున్న ఆ చిన్నారి అసలు పేరు అనుష్క మల్హొత్ర.


డాడీ సినిమా వచ్చి నేటికి 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ చిన్నారి పాత్ర గుర్తుండిపోయింది.  తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అనుష్క మల్హొత్రకు డాడీ విజయం తర్వాత చాలా ఆఫర్స్‌ ఆమెను వరించాయి. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాలకు గుడ్‌ బై చెప్పేసింది. డాడీ సినిమా తర్వాత  స్క్రీన్‌పై ఎక్కడా కనిపించలేదు. అప్పటి చిన్నారి ఇప్పుడు కూడా ఎంతో అందంగా ఉంది. తాజాగా ఈమె ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


ప్రస్తుతం యూకేలో ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకప్పటి చిన్నారి పాపలంతా  ఇప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేవుళ్ళు చిత్రంలో చిన్నారి పాత్రలో నటించిన నిత్య శెట్టి ఓ పిట్ట కథ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి అనుష్క మల్హొత్ర హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. 

చదవండి : ‘వల్లంగి పిట్ట’ చిన్నారి ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా!
పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు