ప్రభుదేవా తమ్ముడి డాన్స్‌ రాజా

22 Jan, 2021 00:31 IST|Sakshi

నటుడు–దర్శకుడు ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్‌ కుమార్, శ్రీజిత్‌ ఘోష్, రాంకీ, మనోబాల, ఊర్వశి, జూనియర్‌ బాలయ్య ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాన్స్‌ రాజా డాన్స్‌’. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని తమిళనాడు మాజీ గవర్నర్‌ – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ కొణిజేటి రోశయ్య ఆవిష్కరించి, ‘డాన్స్‌ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘రోశయ్యగారి చేతుల మీదుగా మా చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదలవడం గర్వకారణం మాత్రమే కాకుండా విజయసూచకం. ఎం.ఎం. శ్రీలేఖ ఆలపించిన నాలుగు పాటలూ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమిళంలో విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మక ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ రవి కనగాల పాల్గొన్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు